Nayantara guest role in Mahesh Babu Movie The Business Man



Nayantara


పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ‘బిజినెస్ మ్యాన్’ సినిమా తెరకెక్కనున్న సంగతి తెల్సిందే. ఈ సినిమా కోసం పూరి జగన్నాథ్, ఏరికోరి మరీ కాజల్ ని హీరోయిన్ గా బుక్ చేసుకున్నాడు. హన్సిక ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ చేయనుందనే గాసిప్స్ విన్పిస్తున్నాయి. ఇదిలా వుంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నయనతార కన్పించనుందట. ఐదు నిమిషాల పాటు కన్పించే ఈ పాత్ర కోసం నయనతార అయితే బావుంటుందని పూరి భావిస్తున్నట్టు సమాచారం.

చాలా స్టైలిష్ గా ఈ పాత్ర వుండబోతోందని, ఆల్రెడీ నయనతారతో ఈ పాత్ర కోసం పూరి సంప్రదింపులు జరిపాడని తెలస్తోంది. నయనతార సైతం పూరి ఆఫర్ కి ఓకే చెప్పిందట. గాసిప్స్ విన్పిస్తున్న వార్తలే నిజమైతే, మహేష్ తో నయనతార జతకట్టడం ఇదే తొలిసారి అవుతుంది

Leave a Reply

games